గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు సిహెచ్.చిన్న మాల్యాద్రి కుటుంబ సభ్యులు అంకమ్మకు ఎక్స్ గ్రేషియాకి సంబంధించి రూ.2 లక్షల చెక్ ను మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో అందించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నగర పాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ఇటీవల ప్రజారోగ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న చిన్న మాల్యాద్రి అనారోగ్య కారణాలతో మరణించగా, వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షల చెక్ ని అందించామని తెలిపారు. మట్టి ఖర్చులు రూ.15వేలను ఇప్పటికే ఇచ్చామని తెలిపారు. కార్మికుల కుటుంబాలకు నగర పాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలు, పి.ఎఫ్. కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబందిత విభాగాధిపతులను, సూపరిండెంట్లను ఆదేశించామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, మీరావలి, చిష్టి, ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిఎంహెచ్ఓ డాక్టర్ అమృతం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News