తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బుధవారం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఈ పరీక్షలకు మొత్తం 911 మంది అభ్యర్థులకు గాను 610 (66.96శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని, 911 అభ్యర్థులకు గాను 610 అభ్యర్థులు హాజరయ్యారని వెరసి మొత్తం 66.96 శాతం హాజరయ్యారని, 301 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షలు రాసే విద్యార్థులు అస్వస్థకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు.
Tags tirupathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News