-జంతువుల పట్ల క్రూరత్వ నివారణ జిల్లా కమిటీ ఏర్పాటు
-డిఆర్ఓ, టి. సీతారామ మూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పశు ఆధారిత ఉత్పత్తులపై ఆ ధారపడి జీవించే వారి జీవితా ల్లో వెలుగు నింపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగు తోందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జంతువుల పట్ల క్రూరత్వ ని వారణ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డిఆర్ ఓ మాట్లాడుతూ జంతువుల పట్ల క్రూరత్వ నివారణ జిల్లా కమిటీ ఏర్పాటు చేసినట్లు సీతారామూర్తి తెలిపారు. ఈ కమిటీలో చైర్ పర్సన్, ప్రెసి డెంట్ గా జిల్లా కలెక్టర్ వ్యవహ రిస్తారు అన్నారు. వైస్ ప్రెసి డెంట్లు 1, 2, గా చీఫ్ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్, ఎస్పీ ఉంటారని తెలిపారు. జంతువుల పట్ల క్రూరత్వ నివారణ పట్ల నాన్ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ గా దినేష్ వైష్ణవ్, సెక్రటరీగా జెడి, పశుసంవర్ధ శాఖ ను నియమిం చినట్లు తెలిపారు. మెంబెర్స్ గా 12 మంది వ్యవహరిస్తారని తెలిపారు. యానిమల్ షెల్టర్ కొరకు జిల్లాలో కోరుకొండ మం డలం కనుమూరు గ్రామంలో ఐదు ఎకరాల భూమి సర్వే చేయడం జరిగిందని, జిల్లాకు దగ్గరలో ఐదు రెండు పది కిలోమీటర్లు పరిధిలో ఉండే టట్లుగా యానిమల్ షెల్టర్ త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. యానిమల్ షెల్టర్ నిమిత్తం మెగా గోకులం నిర్మించుకోవడానికి 25 లక్షల రూపాయలు ప్రతిపాదనలు పంపించడం జరిగింది అన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 50 లక్షల రూపాయలు నిధు లు మెగా గోకులం నిర్మించుకో వడానికి మంజుల మంజూరు కాబడ్డాయని తెలిపారు. హెడ్ క్వార్టర్స్ కి దగ్గరలో ఐదు ఎకరాల భూమిని ఏర్పాటు చేసుకున్న వెంటనే మెగా గోకుల నిర్మించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడి పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాస రావు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్, వీ కిరణ్ కుమార్, సభ్యులు తమ్మ రవి, బోడపాటి వెంకట ముత్యాలరావు, దేవరపల్లి సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News