విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అతీతంగా కృషిచేస్తున్న రైతు నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సోమవారం గాంధీనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌నందు జరిగిన కార్యక్రమంలో రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీప్రసాద్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. భారీ సాగునీటి ప్రాజెక్టులలో గేట్లను నిర్మించటంలోనూ, నిర్వహణలోను ప్రముఖ ఇంజనీరు కన్నయ్య నాయకుడు ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ…1971లో తిరుపతి వెంకటేశ్వరస్వామి యూనివర్శిటీలో ఇంజనీరింగ్పూర్తి చేసి అప్పటి నుంచి వాటర్ రీసోర్సెస్ అన్ని టైప్స్ ఆఫ్ గేట్స్, ఎక్విప్‌మెంట్‌లో అనుభవం పొంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్‌లో పనిచేసి రిటైర్ అయి కూడా ఇప్పటి కూడా పనిచేస్తూ సుమారు 500 ప్రాజెక్టులకు గేట్లు అమర్చి రైతులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. సౌత్ ఇండియాలో గుజరాత్‌లోనూ, మహారాష్ట్రలోనూ మన 4 రాష్ట్రాల్లో వుండే అన్ని రకాల ప్రాజెక్టుచేసి మనవాళ్ళకు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటూ వుంటాను. ఇప్పటికి నా 53 ఏళ్ళ అనుభవంతో ఈ ఫీల్డులో పోయిన సంవత్సరం ఆగస్టులో తుంగభద్ర 14 లక్షల ఎకరాల పంట ఎండిపోతుందనప్పడు స్టాప్ బ్లాక్స్ లేకపోయినా ఐఎంఐలో గేటు ఏర్పాటుచేసి కొట్టుకుపోయిన గేటులా ఏర్పాటుచేసి నీళ్ళు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రకాశం బ్యారేజీలో వరదల సమయంలో బోట్లు వచ్చి కొట్టినపుడు గేట్లు మార్చి రిపేరు చేసి గేట్లు బలం పెంచినట్లు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో వున్న మిగతా ప్రాజెక్టులను స్టడీచేసి వాటిని ఎలా ఇంప్రూవ్ చేసి రైతులకు ఎలా నీళ్ళు ఇవ్వాలని సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు సోమశిల, తిరుపతిలో వుంటే ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీలో తదితర ప్రాజెక్టుల ఇంప్రూవ్మెంట్ తదితర విషయంలో సలహాలు రైతులకు అండగా వుంటానని తెలిపారు. అలాగని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులకు ఎక్కడ సమస్య వున్నాకూడా పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
సభాధ్యక్షులు అక్కినేని భవానీ మాట్లాడుతూ ప్రసాద్ సమావేశాన్ని ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జరగాలంటే రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంఘం వుంటేనే అవకాశం వుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దానికి కారణం అధికార పార్టీలో ప్రతి రాజకీయ పార్టీకి అనుబంధంగా రైతు సంఘం వుంది. అధికార పార్టీలో రైతు సంఘం అధికార పార్టీలో తప్పు ఒప్పులను చెప్పలేవు. అలాగని ప్రతిపక్ష పార్టీలో వున్న పార్టీకి సంబంధించి రైతు సంఘాలను చెప్పవాటిని పట్టించుకోవట్లేదు. అందుకనే రాజకీయ పార్టీలకు అతీతంగా వుండే రైతు సంఘం ద్వారానే రైతుల సమస్య పరిష్కారానికి అవకాశం వుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి 3 అంచెల విధానాన్ని అవలంభించాలని అసెంబ్లీస్థాయి లెవెల్, పార్లమెంట్‌స్థాయి లెవెల్, రాష్ట్ర స్థాయి లెవల్లో రైతు సంఘాన్ని ఏర్పాటుచేసుకుని మన సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. దాని కోసమే ఈ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. దాదాపు 26 జిల్లాల నుంచి రిప్రజేంటేషన్ వచ్చిందన్నారు. దానిమీద ఒక అడహక్ కమిటీని ఏర్పాటుచేసుకుని రాబోయే 3 నెలలో దీనికి ఒక విస్తృత రూపాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. అవి ‘నరేగా’ ప్రోగ్రాంని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయడానికి పరిశీలనచేసి అమలు చేయడానికి ప్రయత్నం, పోలవరం ప్రాజెక్టు 45.73 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని గోదావరి ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుని నూటికి నూరుపాళ్ళు అమలు చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వుంది కాని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని ఖచ్చితమైన అభిప్రాయాన్ని ప్రజలకు ముందుకు తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. సోమనాథన్ కమీషన్ సూచించిన విధంగా సి2G50% ఇస్తే తప్ప రైతుకు గిట్టుబాటు కాదని అంశం ఏదైతో వుందో దానిని చట్టబద్దతగా కేంద్రం రైతుకు అందించాలన్నారు. రాజ్యాంగ పరంగా వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలో వున్న అంశం అయినప్పటికి కంట్రోల్స్ అన్ని కేంద్రం ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఉదాహరణకు ఎక్స్పోర్ట్`ఇంపోర్ట్స్, క్రాప్ ఇన్సూరెన్స్, లోన్స్ తదితర విషయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే వుంది. కాబట్టి వ్యవసాయిన్ని …. లిస్టులో తీసుకురావాలనేది మా ప్రధానమైన డిమాండ్ అని అన్నారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటే కొన్ని సమస్యలకు పరిష్కారంలో లభించవచ్చు. అలాగే నేషనల్ హైవ్సే, ఎలక్ట్రిసిటీ లైన్స్‌కి కోసం రైతుల దగ్గర తీసుకున్న పొలానికి సరైన ధర లభించడం లేదన్నారు. ఈ విషయంలో సరైన విధానంలో చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వుంది కాబట్టి ఆదిశగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
సమన్వయ కమిటీ ఛైర్మన్ వట్టికొండ జయరామయ్య, మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావులు మాట్లాడుతూ రైతులు తన తరువాత తరం రైతాంగ వ్యవస్థలోకి వారు రావాలనే ఆకాంక్ష వారిలో లేదని, రైతులేనిది మనం తినే ధాన్యం పండిరచేవారు కొరవడే ఇబ్బందికర పరిస్థితులు వున్నాయని అటువంటివి ఏర్పడకుండా రైతుకు తగిన ప్రాధాన్యత ఇచ్చి రైతు సమస్యలు తీర్చి రైతులను సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులందరూ ఐక్యమత్యంతో సంఘటితం కావాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నాయకులు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చలసాని శ్రీనివాసరావు, ఐసిఎఆర్ న్యూఢల్లీి అవార్డుగ్రహిత జి.వెంకటరామరాజు, నాయకులు వి.రామ్మోహన్రావు, 26 జిల్లాల వివిధ సంఘాల నుండి వివిధ ప్రాంతాల రైతులు, వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News