Breaking News

కలెక్టరేట్ లో 159 అర్జీల స్వీకరణ

-రెవెన్యూ 75 , పంచాయతీ రాజ్ 25 , పోలీస్ 14 , ఇతర శాఖలు 45
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించే క్రమంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) లోఅధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం తో పాటు సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలను ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ… ప్రజలు కేంద్రం గా పాలన కొనసాగాలనే ఉద్దేశ్యం తో ,పాలనా ప్రక్రియలో “ప్రజలకు ప్రథమ స్థానం” కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం “స్వర్ణ ఆంధ్ర సంకల్పం” కార్యక్రమం చేపడుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా…క్షేత్ర స్థాయిలో వాస్తవాలని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సీనియర్ అఖిల భారత సర్వీస్ అధికారులు మూడు రోజులు పర్యటనలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటన ల్లో ప్రజల తో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు.

సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ లో 159 అర్జీలు స్వీకరించగా, రెవెన్యూ శాఖ వి 75 , పంచాయతీ రాజ్ 25 , పోలీస్ 14 , ఇతర శాఖలకు సంబంధించిన 45  అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.  జవాబుదారీతనం కలిగి ఉండాలని, అర్జిల పరిష్కార విషయంలో చొరవ చూపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల్లో పరిష్కారించాల్సినవి 5, 48 గంటల్లో పరిష్కరించాల్సినవి 35, 72 గంటల్లో పరిష్కారం చెయ్యాల్సినవి 16 ఉన్నాయన్నారు. రీ ఓపెన్ చేసినవి 137 ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పరిష్కారం సాధ్యం కాని వాటి విషయంలో అర్జీదారుకు సమగ్ర అవగాహన కల్పించడం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. పరిష్కారం అయ్యే వాటి విషయంలో ఖచ్చితత్వం జవాబుదారీతనం కలిగి ఉండాలనీ కోరారు.

కొన్ని అర్జీలు:
రాజమండ్రి ఐదుబళ్ళ మార్కెట్ కు చెందిన షేక్ నూర్జహాన్ భర్త గౌస్ మొహిద్దిన్ 2023 జులై లో మరణించారని, అదే విధంగా ధవళేశ్వరం కు చెందిన బల్ల రాజేశ్వరి భర్త వీర్రాజు 2023 అక్టోబరు నెలలో మరణించారని, తమ వారికి పెన్షన్ మంజూరు చెయ్యాలని కోరారు. ప్రస్తుతం 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య మరణించిన వారి జీవిత భాగస్వాములకే పింఛను దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని, 2023 డిసెంబర్ ముందు మరణించిన వారి జీవిత భాగస్వాములకు కూడా ఈ అవకాశం కల్పించాలని కోరారు. రాజానగరం – వెలుగుబంధ కి చెందిన పి. వెంకట రమణ  సర్వే 178/2 లో భూమి కొలతలు పై అర్జీ అందచేశారు. కడియం కు చెందిన బి సునీతా తనను ఏక పక్షంగా గ్రూప్ నుంచి తొలగించారని, ఎక్కడో విదేశాల్లో పనిచేస్తున్న వారికి అక్రమంగా సభ్యత్వం ఇవ్వడం జరిగిందనీ అర్జీ అందచేశారు.

రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామానికి చెందిన గోశాల చక్రధర రావు తన అర్జిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో బోర్ వెల్ కు అధికారులు అనుమతి ఇచ్చినా, కొందరు వ్యక్తులు అభ్యంతరం చేస్తున్నట్లు తెలిపారు. బొమ్మూరు వెంకటేశ్వర నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం అతి అందచేశారు.

గోపాలపురం కోమటి గుంట గ్రామానికి చెందిన  పి. రామకృష్ణ సొంత ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఇంటి స్థలంలో ఉన్న విద్యుత్ పోల్ మార్పు చేయాలని అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. సంబంధించిన రుసుము చెల్లించిన ఇంకా పోల్ మార్పు చేయాలేదని అర్జీ ఇవ్వడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *