Breaking News

ఖేలో ఇండియా 2025 యూత్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు  తృతీయ స్థానం

-స్విమ్మర్ లను అభినందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖేలో ఇండియా 2025 యూత్ గేమ్స్ అండర్-18 కేటగిరీలో ఆల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో 64 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తృతీయ స్థానంలో నిలిచింది. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన అండర్-18 స్విమ్మర్లు తీర్థు సామదేవ్, దేవ గణేష్, యజ్ఞ సాయి  విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్రును  కలిశారు. కమిషనర్  స్విమ్మర్లను అభినందిస్తూ, వారు రాష్ట్రానికి గర్వకారణమని ప్రశంసించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్విమ్మింగ్‌లో  సాధించిన ఘనత రాష్ట్రం గర్వించదగ్గ విషయం అని,  వారి ప్రతిభకు విజయవాడ నగరపాలక సంస్థ తరఫున మద్దతు ఉండే విధంగా అన్ని విధాలా సహకరిస్తారని, భవిష్యత్తులో వారు మరింత ప్రగతి సాధించాలని అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అఫ్ స్పోర్ట్స్ డాక్టర్ లత, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఐ. రమేష్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి. వినోద్, సహాయక కోచ్ నితీష్, ఇతర కోచ్‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *