విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర గారి అధ్యక్షతన నూతన భవనంలోని మీటింగ్ హాల్లో రెవెన్యూ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన ఆధ్వర్యంలో వార్డ్ అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమీక్షలో నగరంలోని పన్ను వసూళ్ల స్థితి, వసూలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, తదితర అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పన్నులు నగర అభివృద్ధికి మూలస్తంభాలని, ప్రజల నుండి రావాల్సిన పన్నులను సకాలంలో వసూలు చేయడం ప్రతి అడ్మిన్ సెక్రటరీ బాధ్యతని, ప్రతి రోజూ వారు తమ విధుల్లో ప్రజల వద్ద నుండి పన్నులను వసూలు చేసే చర్యలు చేపట్టాలని, నగర అభివృద్ధి, పౌర సేవల నిర్వహణకు ఆర్థిక వనరులు అత్యవసరమని అని స్పష్టం చేశారు.
సమావేశంలో అడ్మిన్ సెక్రటరీలు తమ పని సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ ధ్యానచంద్ర గారికి వివరించాగా, సెక్రటరీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారు లను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్లు హెలెన్, శ్రీనివాస్, శర్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News