Breaking News

రైతన్నా నేనున్నానంటున్న మంత్రి కందుల దుర్గేష్

-మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు నియోజకవర్గంలో 8025 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలుకు చర్యలు
-నిడదవోలు మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, పెరవలి మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, ఉండ్రాజవరంలో 6025 మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలుకు ఆదేశం
-రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మంత్రి దుర్గేష్
-విత్తనం నుండి విక్రయం వరకు అన్నదాతకు అండగా ఉంటామని హామీ

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు నియోజకవర్గంలో మరో 8025 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.. అందులో భాగంగా నిడదవోలు మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, పెరవలి మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, ఉండ్రాజవరం మండలంలో 6025 మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలుకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నిడదవోలు మండలంలోని అట్లపాడు, డి.ముప్పవరం, కోరుపల్లి, మునిపల్లి, పందలపర్రు, సమిశ్రగూడెం-1, సమిశ్రగూడెం-2, తాళ్లపాలెంలలో ఒక్కో గ్రామంలో 100 మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం సేకరించనున్నామన్నారు. సింగవరం గ్రామంలో 200 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.

అదే విధంగా పెరవలి మండలంలోని కానూరు-1, పిట్టల వేమరం, పెరవలి-1లో 150 మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం సేకరిస్తామన్నారు. కానూరు అగ్రహారంలో 175 మెట్రిక్ టన్నులు, కాపవరంలో 75, నడుపల్లి, అజ్జారంలలో 50 మెట్రిక్ టన్నుల చొప్పున సేకరించనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా ఖండవల్లి-3, ముక్కామల-1లో 100 మెట్రిక్ టన్నుల చొప్పున సేకరించనున్నారని వివరించారు.

ఇక ఉండ్రాజవరం మండలంలోని కాల్దారి గ్రామంలో 1350, పసలపూడిలో 1100, మోర్త-2లో 950, ఉండ్రాజవరం-2,వడ్లూరులో 650 మెట్రిక్ టన్నుల చొప్పున, సత్యవాడలో 500, ఎస్ఆర్ పాలెంలో 400, తాడిపర్రులో 300, పలంగిలో 125 టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.

రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం అని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ధాన్యం సేకరణలో గతంలో పడిన పాట్లు ఏ ఒక్క రైతు పడకూడదని ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు. విత్తనం నుండి విక్రయం వరకు రైతన్నకు తానున్నానంటూ మంత్రి కందుల దుర్గేష్ భరోసానిచ్చారు.. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు అవుతుందని తెలిపారు.అన్నదాత ఆరుగాలం శ్రమించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో దుష్ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దగా పడ్డ రైతన్నకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు.

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ధాన్యం లక్ష్యం పెంపుకు చర్యలు తీసుకోవడంపై నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచమని అడిగిన వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన మంత్రి కందుల దుర్గేష్ పని తీరుపై నియోజకవర్గ రైతాంగం సంతోషం వ్యక్తం చేసింది. అంతేగాక కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *