Breaking News

వర్షపు నీటి నిలవలు రోడ్ల పైన ఉండకుండా చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షపు నీటి  నిలువలు రోడ్లపై ఉండరాదని  విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా  బెంజ్ సర్కిల్ లయోలా కాలేజ్ పినమినేని పోలిక లేని మున్సిపల్ స్టేడియం మొగల్రాజపురం ధర్నా చౌక్ గాంధీనగర్   ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్ల పైన ఎటు పరిస్థితిలో ఉండరాదని దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వర్షపు నీరును తొలగిస్తూ డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేయాలని అధికారులను ఆదేశించారు.  డీసిల్టింగ్ ప్రక్రియను నిరంతరం  జరుగుతూ ఉండాలని, అప్పుడే వర్షం పడినప్పుడు రోడ్లమీద నీటి నీళ్లలో ఉండవని అన్నారు. తదుపరి ధర్నా చౌక్ వద్దగల అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. ఆహారంలో నాణ్యత త్రాగునీటి సరఫరా పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు తమ తమ అన్న క్యాంటీన్లు పర్యటించే అక్కడున్న లోపాలను గుర్తించి వెంటనే సరి చేయాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో  జోనల్ కమిషనర్ కె షమ్మీ, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్,  ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *