విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 2025లో నిర్వహించిన SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు 23.04.2025న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం, రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ దరఖాస్తులు పాఠశాలల లాగిన్‌లో 24.04.2025 నుండి 01.05.2025 వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. దీనికి సంబంధించి 66,421 జవాబు పత్రాలు రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ కోసం విద్యార్థులచే దరఖాస్తు చేశారు. 66,421 జవాబు పత్రాలలో, మొత్తం 47,484 జవాబు పత్రాల ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ఫలితాలు కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ ఫలితాలు పాఠశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంచబడతాయి. సంబంధిత ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్ చేసి, ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసిన వెంటనే సంబంధిత విద్యార్థులకు సాఫ్ట్‌కాపీ/హార్డ్‌కాపీ రూపంలో అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి కోరారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News