Breaking News

మోడీ ఫిట్నెస్ మంత్ర జయప్రదం చేయడానికి విజయవాడ పోలీస్ సన్నద్ధత… : యోగ శక్తి సాధనా సమితి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2025 అంతర్జాతీయ యోగా ఉత్సవాలలో భాగంగా చేపట్టనున్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన పెంపొందించడానికి చేపట్టనున్న కార్యక్రమాలకు సాయం చేయటానికి విజయవాడ పోలీస్ తన ప్రాథమిక సన్నద్ధతను ప్బ్రోచర్ ఆవిష్కరించడం ద్వారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్ ) కె. జి. వి సరిత ఐ.పీ.ఎస్ తెలియజేసార్ అని యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.గంట పాటు జరిగే ఈ అవగాహన సదస్సులు లో ప్రపంచవ్యాప్తంగా యోగా ఆవశ్యకతను తెలియజెప్పి,భారత ప్రధాని మోడీ ఫిట్నెస్ మంత్రతో రోగాలను, రుగ్మతల నుంచి బయటపడ్డానికి సమాజాన్ని సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేస్తున్నారు.ఇందులో భాగంగా ప్రాణ శక్తిని పెంచే లాగా ఉత్తమ ప్రాణాయామ విధానాలను నేర్పటం,ఆక్యుప్రెషర్ హ్యాండ్ స్టిక్ ఉపయోగించే విధానం, వచ్చే బెనిఫిట్స్ తెలియజేయబడతాయని అలాగే బేర్ ఫుట్ వాక్కు ద్వారా ఫుట్ రిఫ్లెక్సాలజీ గురించి చెప్పి వచ్చే బెనిఫిట్స్ ని తెలియజేయబడతాయని,ఆసనాలు, ఎక్సర్సైజెస్ తరువాత అంతర పంచభూతాలను సమస్థితికి తీసుకు రావలసిన అవసరాన్ని తెలియజేసి తీసుకొచ్చే విధానం రుగ్మతలను తగ్గించుకునే లాగా ఇక ముందు రోగాలు,రుగ్మతుల బారిన పడకుండా ఎవరికి వారే చికిత్స చేసుకునే లాగా సమాజాన్ని తయారు చేయడానికి మోడీ ఫిట్నెస్ మంత్ర ఉపకరిస్తుంది అని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేస్తున్నారు. పాల్గొనువారు సెల్ 9000347369 ను సంప్రదించండి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *