-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ ఆర్ సిఎస్) జిల్లా బ్రాంచ్ వార్షిక సర్వసభ్య సమావేశం జూన్ 11వ తేదీ ఉదయం 11.00 గం జిల్లా కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరములో నిర్వహించడం జరుగుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) జిల్లా బ్రాంచ్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశములో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) కమిటీ నియమాలు 2017ను అనుసరించి ఎన్టీఆర్ జిల్లా బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులను అనగా చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి మరియు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కావున రెడ్ క్రాస్ సభ్యులు (పోషకులు/వైస్-పోషకులు/లైఫ్ సభ్యులు/లైఫ్ అసోసియేట్లు) తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావలసినదిగా కోరడం జరిగిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా బ్రాంచ్ అధ్యక్షులు, కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News