గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాలు రూపొందించటాన్ని మరింతగా మెరుగుపర్చాలన్న ఉద్దేశ్యంతో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారులు ప్రతి నెల సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ శంకరన్ హాల్ లో జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి , ఆర్డిఓ కే. శ్రీనివాస రావు తో కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డా. తాతా సేవాకుమార్, భారతీయ జనతా పార్టీ నుంచి వై.వి. సుబ్బారావు , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బిళ్లా సునీల్ కుమార్, తెలుగు దేశం పార్టీ నుంచి ఓంకార్ , జనసేన పార్టీ నుంచి సీహెచ్ త్రినాధ్ రావు , సిపిఐ ( మార్కిస్ట్ ) పార్టీ నుండి వై. కృష్ణ కాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నెల రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించటం జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీలు తెలిపిన అంశాలు, సూచనలు, సలహాలను జిల్లా స్థాయిలో పరిష్కరించే వాటిని వెంటనే పరిష్కరించటం జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలోను, పాలసీలకు సంబంధించిన అంశాలు, సలహాలపై చర్యల కోసం ఎన్నికల సంఘానికి పంపించటం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు గుంటూరు తూర్పు , పశ్చిమ నియోజకవర్గాలలోని బిఎల్ఓ ల జాబితా అందించాలని కోరారు. అలాగే ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వారిపై పోలీస్ స్టేషన్లలో కేసులు ఫైల్ చేయడం జరిగిందని, ఇంతవరకు చర్యలు తీసుకోలేదని , దీని విషయమై ప్రస్తుత పరిస్థితి తెలియజేయాలని కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల లోపు ఓటరు కార్డు ఆధార్ కార్డుకు అనుసంధానం చేయించాలని కోరారు. పోలింగ్ బూత్ లు పెంచడానికి చర్యలు తీసుకోవాలని , నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో కూడా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని కోరారు. అలాగే బీఎల్వోలు క్లైమ్స్ వెరీఫికేషన్ కు వెళ్లేటప్పుడు బీఎల్ఏ లను కూడా తీసుకువెళ్ళేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపిన పలు అంశాలపై జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ ఓటరు కార్డు ఆధార్ కార్డుకు అనుసంధానం అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారి ఓట్లు, డబల్ ఎంట్రీ ఓట్లు , రాష్ట్రం దాటిపోయిన వారి ఓట్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బీఎల్వోలు తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్వోల జాబితాను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలన్నారు. 2026 జనవరి 5 న ఓటరు జాబితా రూపొందించడం జరుగుతుందని , దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు , మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లు పెంచడానికి బిల్డింగ్స్ గుర్తించి ప్రతిపాదనలు అందిస్తే ఎన్నికల సంఘానికి పంపుతామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో తెలిపిన అన్ని అంశాలను మినిట్స్ రూపంలో నమోదు చేసి వాటికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. గత సమావేశం మినిట్స్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరిగింది.
సమావేశంలో ఈఆర్వోలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, డీఆర్డిఏ పీడీ టీ.వి.విజయలక్ష్మీ , ఏఈఆర్ఓలు గుంటూరు తూర్పు, పశ్చిమ , జీయంసీ డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాస రావు , సిహెచ్ శ్రీనివాస రావు , ప్రత్తిపాడు , తెనాలి , మంగళగిరి , పొన్నూరు తహశీల్దార్లు జి. కరుణ కుమార్, గోపాల కృష్ణా, దినేష్ రాఘవేంద్ర , జియా ఉల్ హక్ , ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News