Breaking News

జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తెలిపారు.
బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగ ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ , నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర , డిప్యూటీ మేయర్ సజీల , జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కే ఖాజావలి, ఆర్డిఓ శ్రీనివాసరావు , వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ యోగాలోని వివిధ అంశాలపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. యోగాంధ్ర-2025 థీమ్ తో నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ తెలిపారు. ప్రముఖులు, మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులతో ప్రజలను యోగాకు సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని , యోగాపై నెల రోజుల పాటు జిల్లా నలుమూలలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని , యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరికీ యోగా పట్ల అవగాహన, ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈ నెలరోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టి అవగాహన ర్యాలీలు, మారథాన్ పరుగు, రంగోలి, విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడం ద్వారా చిట్ట చివరి వ్యక్తి వరకు యోగా చేరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల, వార్డులలో జరిగే యోగా కార్యక్రమాలకు అసరమైన ట్రైనర్లను ఏర్పాటు చేసామన్నారు. మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్సీ , ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం జరుగుతుంది తెలిపారు. జిల్లా దేవాలయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లోనూ ఈ నెలరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాడం జరుగుతుందని తెలిపారు . ఈ నెల రోజుల పాటు జరిగే యోగాంధ్రా 2025 కార్యక్రమం విజయవంతం చేసేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్య అధికారులు, వివిధ యోగ అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులు, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *