Breaking News

ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాలు ప్రేరణాత్మకం

-అభినందించిన రాజస్థాన్ సీమ్యాట్ బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో లీడర్ షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమాల అమలు తీరు బాగుందని, నిపుణ్ భారత్ లక్ష్యాల దిశగా అధునాతనమైన సమగ్ర విద్యా విధాలను అవలంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిదాయకమని, తమ రాష్ట్రంలోని కూడా ఈ కార్యక్రమాలు అమలు చేస్తామని రాజస్థాన్ సీమ్యాట్ బృందం ప్రశంసించింది. బుధవారం సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఆగిరపల్లి హీల్ లో లీడర్ షిప్ ట్రైనింగ్, విజయవాడ మ్యారీ స్టెల్లా కాలేజీలో జరుగుతున్న ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కేంద్రాలను సందర్శించారు. శిక్షణా శిబిరాల్లోని కొన్ని సెషన్లను ప్రత్యక్షంగా వీక్షించి, రిసోర్స్ పర్సన్స్, విద్యా శాఖాధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. రాజస్థాన్ బృందం నుండి డా. రచన శర్మా (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ – శిక్షణ), దీపికా శామ్యూయెల్ (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ – పరిశోధన), రాధేశ్యామ్ శర్మా (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ – పరిపాలన) తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు IAS., ని కలిశారు. ఉపాధ్యాయులకు నాయకత్వ నైపుణ్యాలు (Leadership Competencies)లో భాగంగా స్వీయ-అవగాహన (Self-Awareness), స్వీయ నిర్వహణ (Self-Management) కమ్యూనికేషన్ (సంభాషణ), ప్రభావం (Influence), అభ్యాస సంస్కృతిని ప్రోత్సహించడం (Promoting a learning culture), పాఠశాల నిర్వహణ- ఇతర అంశాలు (School Management & Other Aspects), పాఠ్యప్రణాళిక- బోధన నిర్వహణ (Managing Curriculum & Instructions), పాఠశాల వనరులు – వ్యవస్థల నిర్వహణ (Managing School Resources and Systems), ఆర్థిక వనరుల నిర్వహణ (Managing Financial Resources), విపత్తు ప్రమాద నిర్వహణ (Disaster Risk Management) పాఠశాల భద్రత (School Safety) తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., వివరించారు. ఈ సందర్శన ద్వారా, రెండు రాష్ట్రాల మధ్య విద్యా రంగంలో ఉత్తమ విద్యా విధానాలను పంచుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *