Breaking News

రైల్వే స్టేషన్ ను ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

-అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రారంభోత్సవం
-సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను ఎమ్మెల్యే విజయశ్రీ తో కలిసి ప్రారంభించనున్న పెమ్మసాని 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ ను స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటకు, శ్రీ సిటీ, ఏపీఐఐసీ సెజ్ లోని రెండు లక్షలకు పైగా పనిచేసే ఉద్యోగస్తులకు, పులికాట్ సరస్సు లోని పక్షుల పర్యాటక కేంద్రానికి అలాగే తడ ప్రాంతానికి ఉంపకరించేలా, నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను అత్యాధునీకరించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాన్ని పెమ్మసాని నేరుగా నిర్వహిస్తారు. గురువారం ఉదయం కేంద్ర సహాయ మంత్రి సూళ్లూరుపేటకు ఉదయం 8.30 కి రోడ్డు మార్గాన చేరుకోనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *