మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ అధిక రక్తపోటు నియంత్రణ మాసోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రైవేటు గైనకాలజిస్ట్ వైద్యుల అవగాహన సదస్సు లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యస్ శర్మిష్ఠ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాట్లాడుతూ ప్రజల్లో రక్తపోటు నియంత్రణ మీద అవగాహన మరింత రావాల్సిన అవసరం ఉందని,ఆహారంలో అధిక ఉప్పు, నూనెలు , చెక్కెర నియంత్రణ వల్ల అధిక రక్తపోటు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని, రక్తపోటు నియంత్రణ కొరకు తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన అధిక రక్తపోటును గుర్తించి తగిన చికిత్స అందించి అనారోగ్య సమస్యలను ప్రారంభంలోనే నియంత్రించి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలియజేశారు. ఈ సదస్సులో జిల్లా కార్యక్రమ నిర్వహణాధికారులు డా.హిమబిందు, జిల్లా స్థాయిలో ప్రైవేటు గైనకాలజిస్ట్ వైద్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News