Breaking News

ఈనెల 28న గన్నవరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా…

-జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలి..
-జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.28.05.2025 బుధవారం నాడు ఉదయం 09:00 గంటలకు గన్నవరం లోని “ప్రభుత్వ పాలిటెక్నిక్ ళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ తెలియజేసారు.*

ఈ జాబ్ మేళాలో, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జాస్పర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్సియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ తదితర ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్ బాబు  మరియు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్  తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసి మరియు పీజి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి ఆసక్తికర వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, మే 28న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 94940 05725, 63006 18985, 96666 54641 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *