Breaking News

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి రక్తదానం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి రక్తదానం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నగరంలోని పరాసుపేట సువర్ణ కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ( ఐ ఆర్ సి ఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని డిఆర్ఓ ప్రారంభించి రక్తదానం చేశారు. అనంతరం డిఆర్ఓ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రక్తదానం చేయడం ఒక సామాజిక బాధ్యత అని ప్రజలందరూ ఆ దిశగా రక్తదానం చేయుటకు ముందుకు రావాలన్నారు.

ఐ ఆర్ సి ఎస్ ఒక గొప్ప స్వచ్ఛంద సంస్థని మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నెలకొల్పబడిందన్నారు. జిల్లా ఐఆర్సిఎస్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉంటూ రక్త దానాన్ని అన్ని విధాల ప్రోత్సహిస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐ ఆర్ సి ఎస్ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నంలో మొదటి శిబిరం ఏర్పాటు చేశారన్నారు. రక్తదానం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇందుకు సంబంధించిన కరపత్రాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ ఒక్క రక్తదాన కార్యక్రమమే కాకుండా మిగిలిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా సజావుగా చేయాలన్నారు.

మునిసిపల్ కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ రక్తదానం ఒక మహా దానం అని, వాస్తవంగా ప్రకృతిలో తయారు చేయడానికి వీలు లేనిదన్నారు. రక్తం గాని నీరు గాని తయారు చేయలేమని, రక్తం కొరత ఎక్కువగా ఉన్నందున ఐ ఆర్ సి ఎస్ ద్వారా రక్తదాన శిబిరం చేపట్టారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆ విధంగా చేసిన రోజున వారికి సెలవు కూడా ఉంటుందన్నారు.

ఐ ఆర్ సి ఎస్ జిల్లా కార్యదర్శి డాక్టర్ శంకర్నాథ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అన్ని మండలాల్లోనూ ఐఆర్సిఎస్ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో డిఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ స్వయంగా పాల్గొని రక్త దానం చేయడం చెప్పుకోదగ్గ విషయం అన్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటుకు సహకరించిన డిఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవోలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డిఓ కే స్వాతి, స్థానిక ప్రముఖులు కుంచే నాని, డాక్టర్లు హనుమంతరావు, శివ ప్రసాద్, ఐ ఆర్ సి ఎస్ సమన్వయకర్త హరికృష్ణ, యాజమాన్య సభ్యులు రామ్ బాలాజీ, రమేష్,మాధవి, కృష్ణ తేజ, డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *