Breaking News

గ్రామ స్థాయిలో ట్రైనర్లను తయారు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాలో శిక్షణ పొంది గ్రామ స్థాయిలో ట్రైనర్లను తయారు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు యోగా మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో న్యూఢిల్లీ ఆయుష్షు శాఖ వారి ఆధ్వర్యంలో వర్చువల్ గా యోగ మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణలో వివిధ శాఖల ఉద్యోగులు యోగ శిక్షణ కలిగి నమోదుకాబడిన 100 మంది యోగా మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 21వ తేదీ నుండి యోగ ఆంధ్ర కార్యక్రమం మొదలైందన్నారు. ఇందులో భాగంగా తొలి రోజున యోగ ప్రోటోకాల్ అనుసరిస్తూ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమం వచ్చే జూన్ నెల 21వ తేదీ 11వ అంతర్జాతీయ దినోత్సవం వరకు జరుగుతుందన్నారు. యోగ మాస్టర్ ట్రైనర్లు ఇక్కడ బాగా శిక్షణ పూర్తి చేసుకుని మండలాలకు వెళ్లి అక్కడ గ్రామస్థాయిలో యోగా ట్రైనర్ లకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేయాలన్నారు. వారు ఆ ట్రైనర్లు గ్రామాల్లో ప్రతి 50 నుంచి నూరు మంది కుటుంబాలకు యోగా లో శిక్షణ ఇస్తారన్నారు. ఆ విధంగా అందరూ శిక్షణ పొంది వచ్చే జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున వారి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట మాట్లాడుతూ యోగా వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు యోగ చేసినట్లయితే ఆరోగ్య సమస్య కొంతవరకు తగ్గుతుందని, ఆహారం అరుగుదల తక్కువగా ఉన్నవారు, కీళ్ల నొప్పులు ఉన్నవారు యోగ చేసినట్లయితే ఆ సమస్యలు తగ్గు ముఖం పడతాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ సీనియర్ వైద్యాధికారి జావేద్ ఖాన్, వైద్య ఆరోగ్య, ఆయుష్, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *