Breaking News

జననీ మిత్ర యాప్ పై ఎఎన్ఎమ్ ఆశ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశ మందిరం లో జననీ మిత్ర యాప్ పై ఎఎన్ఎమ్ ఆశ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భముగా స్టేట్ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్ కుమార్  ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్రమంగా తగ్గిపోతున్న ఈ సందర్భంలో, మన దేశంలో కూడా ఈ సమస్య ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణీ మహిళలకు ఒక కీలకమైన మార్గదర్శకాన్ని అందించాలనే ఉద్దేశంలో ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వారి పర్యవేక్షణను సులభతరం చేయడానికి “జననీ మిత్ర” యాప్ ను పరిచయం చేయడం జరిగిందని తెలిపారు. ప్రపథమంగా ఈ శిక్షణా కార్యక్రమం తిరుపతి లో ప్రారంభించడంజరిగిందని తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాది కారి డాక్టర్ బాల కృష్ణ నాయక్ మాట్లాడుతూ “జననీ మిత్ర” యాప్‌ను ప్రారంభించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తుందని ఈ యాప్ ద్వారా మహిళల ఆరోగ్య పరిస్థితులపై అత్యంత శీఘ్ర మరియు నిరంతర పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు. ఈ యాప్, సాంకేతికత ఆధారంగా, గర్భిణీల ఆరోగ్యాన్ని, ఆహారపు పోషక విలువలను, వైద్య పరీక్షలు, మందుల నియమాలు, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

గౌరవ్‌ ఐటి హెడ్ (ఎఐజి&ఎఐమ్) సంయుక్త ఫాండే షన్ వారు శిక్షణ కార్యక్రమం గురించి వివరిస్తూ ఈ యాప్ గర్భిణీ మహిళల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి, అవసరమైన చర్యలను మరియు రక్తహీనత వంటి సాధారణ సమస్యలను ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు సూచిస్తుందని తెలిపారు. ఆహారం మరియు పౌష్టిక విలువలు: గర్భిణి ఆరోగ్యానికి అనువుగా ఉండే ఆహారపు సూచనలు మరియు వాటి పౌష్టిక విలువలను యాప్ అందిస్తుందని
సమస్యలను ముందుగానే గుర్తించడం: గర్భిణీ మహిళల ఆరోగ్య సమస్యలను, వాటి ప్రభావాలను ముందుగానే గుర్తించి, వైద్య సలహాలను అందించటం ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం అని అన్నారు. కార్యక్రమం లో డి పిఎమ్ఓ డాక్టర్ శ్రీనీవాసరావ్, డిప్యూటి డి ఎమ్ హెచ్ ఓలు డాక్టర్ మృదుల వాణి డాక్టర్ మురళి కృష్ణలు, డి ఐ ఓ ఇంచార్జ్ డాక్టర్ ఛత్ర ప్రకాష్ రెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్స్ క్రాంతి కుమార్, మనోజ్ కుమార్ డిప్యూటి డెమోలు కిరణ్ కుమార్, ఖాజావలి, ఎస్ ఓ నాగేంద్ర కుమార్, దామినేడు, మంగళం, రేణిగుంట, కమ్మ పల్లి పిహెచ్ సి ల వైద్యాధికారులు, ఏ ఎన్ ఎమ్ లు, ఆశ కార్యకర్తలు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *