తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎం ల తనిఖీ లో భాగంగా రేణిగుంట వద్ద గల ఈవీమ్స్ మరియు వివిప్యాట్ లను భధ్రపరిచే గోడౌన్‌లను డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావు తో కలిసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తనిఖీ చేసారు. సోమవారం. సాయంత్రం ఈవీఎంల తనిఖీ లో భాగంగా రేణిగుంట వద్ద గల ఈవీమ్స్ మరియు వివిప్యాట్ లను భధ్రపరిచే గోడౌన్‌లను తనిఖీ లో భాగంగా షట్టర్లకు వేసిన సీళ్లను, సిసి కెమెరాలను పరిశీలించి భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు,జి ఎన్ ఎస్ ఎస్ డిప్యూటీ కలెక్టర్, నోడల్ అధికారి సుధారాణి, శ్రీ కాళహస్తి ఆర్ డి ఓ, బానుప్రకాష్ రెడ్డి,ఎన్నికల సూపరింటిండెంట్ ప్రసాద్, రేణిగుంట తాసిల్దార్ సురేష్ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News