-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయమునకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు నిర్వహించిన పిజిఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారియొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజిఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో పాటు డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్,రోజ్ మాoడ్, సుధారాణి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ- 150, అటవీశాఖ- 2, పంచాయతీరాజ్ -20, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -8, పాఠశాల విద్యాశాఖ – 5, పోలీస్ – 12, రూరల్ డెవలప్మెంట్ – 5, సివిల్ సప్లై- 15, ఆర్టీసీ -4, Asweris- 6, జాతీయ రహదారులు- 7, పబ్లిక్ హెల్త్- 1, ఎస్సీ కార్పొరేషన్- 1, సర్వే- 8, రిజిస్ట్రేషన్ శాఖ- 4, మత్స్యశాఖ -1, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్- 1, ఎండో మెంట్ -1 , విద్యుత్ శాఖ -8, జలవరుల శాఖ -1, సాంఘిక సంక్షేమ శాఖ -1, ఐటీ -1, కో-ఆపరేటివ్ సొసైటీస్- 1, లేబర్ డిపార్ట్మెంట్ -2, బిసి వెల్ఫేర్ -1, హార్టికల్చర్ -1, ఆర్ అండ్ బి- 1 వెరసి మొత్తం 268 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News