Breaking News

ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత నిర్బంధ ప్రవేశాల తొలి విడత లాటరీ ఫలితాలు విడుదల

-37,427 మంది పిల్లలు నమోదు… మొదటి విడత లాటరీలో 23117 మందికి సీట్లు కేటాయింపు
-వెబ్ సైట్లో నేటి (29.5.25) నుండి ఫలితాలు అందుబాటు
-వెల్లడించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాహక్కు చట్టం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి లాటరీ విధానంలో మొదటి విడత ఫలితాల తుది జాబితా బుధవారం రాత్రి ఖరారు చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాల దరఖాస్తులు మే 2 నుండి మే 19వరకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 37427 మంది పిల్లలు నమోదు చేసుకోగా, 28882 పాఠశాలలు ఎంచుకున్నారు. ఆరు దశల ధ్రువీకరణ ద్వారా 28561 అర్హత సాధించారు. వీరిలో మొదటి విడత లాటరీలో 23117 మందికి సీట్లు కేటాయించారు. ఈ సమాచారం తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయబడుతుంది. పూర్తి వివరాలు ఈ రోజు (29.5.25) https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. పాఠశాలలకు కేటాయించిన విద్యార్థులు తగిన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత పాఠశాలలకు వెళ్లి జూన్ 7లోపు ప్రవేశాలను నిర్ధారించుకోవాలని తెలిపారు. రెండో విడత ఫలితాలను జూన్ 11న విడుదల చేసి, సీట్లు సాధించిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 18న ఖరారు చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చు. ఈ ప్రక్రియ సక్రమంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మార్గదర్శకాలు విడుదల చేశామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *