విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలోని గోసాలను సందర్శించి 64 కేజీల బెల్లాన్ని గోమాతలకు ఆహారంగా అందించారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం ఆహ్వానం మేరకు ప్రత్తిపాటి శ్రీధర్ గోసాలను సందర్శించి గో సేవ చేశారు. సుజనా చౌదరి 64 వ జన్మదినోత్సవం సందర్భంగా 64 కేజీల బెల్లాన్ని గోవులకు ఆహారంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News