తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ , పి.యం.కిసాన్ పథకం అమలు చేయుటకు సిద్ధమైనది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి 20 వేల రూపాయలు 3 విడతలలో ఆర్థిక సహాయం అందజేయనుంది. తిరుపతి జిల్లాలో 145360 రైతు కుటుంబాలను ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరిగింది. అర్హులైన వారి జాబితా ఆయా రైతు సేవా కేంద్రాల సిబ్బంది వద్ద అందుబాటులో ఉంటుంది. కావున రైతులు వారికి సంబంధించిన రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి 20 జూన్ 2025 లోపు ఈ కె.వై.సి పూర్తి చేసుకోవాలని, ఈ కె.వై.సి పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధిoచిన నగదు బ్యాంకు ఖాతాలలో జమ చేయటం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే 3180 మంది రైతులు ఈ కే వై సి పూర్తి చేసుకున్నారని జిల్లా వ్యవసాయ అధికారి యస్. ప్రసాద రావు తెలియజేసారు.
Prajavartha Online Telugu News