Breaking News

మీ కోసం పిజిఆర్ఎస్ కార్య క్రమంలో ప్రజల సమ స్యలు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం…

-కెఆర్ఆర్సి తాహసిల్దార్ బి. అచ్యుత కుమారి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మీ కోసం పిజిఆర్ఎస్ కార్యక్ర మంలో ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కొవ్వూరు, కెఆర్ఆర్సి తాహసిల్దార్ బి. అచ్యుత కుమారి అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదికలో వచ్చిన అర్జీలను అచ్యుత కుమారి స్వీకరించారు. ఈ సందర్భంగా అచ్యుత కుమారి మాట్లాడుతూ మీ కోసం పిజిఆర్ఎస్ ద్వారా సోమవారం 15 అర్జీలు వచ్చాయని తెలిపారు. డివిజన్ అధికారులు మీకోసం పిజిఆర్ఎస్ కార్యక్రమంలో త ప్పనిసరిగా హాజరయ్యి ప్రజల సమస్యలను తీర్చే విధంగా చ ర్యలు తీసుకోవాలని తెలిపా రు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వ డం కోసం “1100 – మీకోసం కాల్ సెంటర్” కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయుటకు మరియు నమో దైన మీ అర్జీ యొక్క యదార్ధ స్థితిగతులు తెలుసుకో వచ్చు నని తెలిపారు.

మీకోసంలో వచ్చిన అర్జీల వివరాలు :
కొవ్వూరు పట్టణానికి చెందిన విత్తం జగన్నాథరావు, 30 సెం ట్లు మా భూమిని సర్వే చేయిం చాలని అర్జీ సమర్పించుకు న్నారు.

పెరవలి మండలం ముక్కా మల గ్రామానికి చెందిన ముసలి నాగపండు మా ఇంటి ముందు పంచాయతీ స్థలంలో అనధికారకంగా ఇల్లు నిర్మిస్తు న్నారు. కావున సమస్యను పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించుకున్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *