Breaking News

గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిపురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జూన్ 21న చేపట్టనున్న యోగా కార్యక్రమంలో దేశ ప్రధాని హాజరు కానున్న నేపధ్యంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం పెందుర్తిలోని డాట్లా మాన్షన్ ఫంక్షన్ హాల్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఎంఎల్ఏలు దేవినేని ఉమా, పి.రమేష్ బాబు, మెప్మా ఎండి తేజ్ భరత్ ఐఏఎస్, వైజాగ్ మేయర్ పి.శ్రీనివాసరావుతో కలిసి సమావేశంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యోగాపై ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్గేలా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసిందని, ఈ నెల 21న వైజాగ్ లో జరిగే యోగా కార్యక్రమ విజయవంతంకు ముఖ్యమంత్రి నుండి స్థానిక ప్రజా ప్రతినిధి వరకు, రాష్ట్ర అధికారి నుండి సచివాలయ కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేస్తున్నారన్నారు. అధికారులు, సిబ్బంది కూడా తమ కుటుంబ సభ్యులతో హాజరు కావాలని, హాజరయ్యే వారు యోగా చేయడానికి వీలుగా ఉండే దుస్తులు ధరించి రావాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *