Breaking News

ప్రజాస్వామ్య పాలనలో నియంతృత్వానికి చోటు లేదని 2024 ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు

– విభజన తర్వాత ఎంతో కష్టబడి రాష్ట్రపునర్నిర్మాణం చేపట్టాం
– జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మొత్తం వ్యవస్థల్ని నాశనం చేశాడు
– మత్స్యకారులకు వేట నిషేధ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ టీడీపీ ఘనతే
– దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో సంక్షేమం అమలు చేస్తున్నాం
– అభివృద్ధిలో దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రాన్ని మారుస్తాం
– అవనిగడ్డలో ‘సుపరిపాలనలో తొలిఏడాది’ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు గారితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. గ్రామంలో తాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలకు సంబంధించిన సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో సాధించిన విజయాలను, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అత్యంత అవసరం. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఎంతో శ్రమించి పనులు చేపట్టాం. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రావడానికి ప్రధాన కారణం నడకుదిటి నరసింహరావు గారి కష్టమే. ప్రధాని వద్దకు వెళ్లి రాష్ట్రంలోని మత్స్యకారులకు అనేక పథకాలు చేసేలా చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించాం. తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే 50 సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్ అమలు చేస్తున్నాం. అదే సమయంలో వేట నిషేధ భృతిని అమలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానిదే.వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.4000 ఆర్ధిక సాయంతో పాటుగా, నిత్యావసర వస్తువులు పంపిణీ ప్రారంభించాం. గత ఐదేళ్లు అరాచక పాలన సాగింది. తప్పుడు కేసులు పెట్టి ప్రతి ఒక్కర్నీ వేధించారు. అక్రమ కేసులో నన్ను అరెస్టు చేసి నాగాయలంక పోలీస్ స్టేషన్లో పెడితే.. ఇక్కడి ప్రజలు ఆదరించిన విధానం ఎప్పటికీ మరచిపోలేను. ఇంటికి తరలించేస్తున్నామని చెప్పి అర్ధరాత్రి వేళ ఎక్కడెక్కడో తిప్పి వేధించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించినందుకు ఏకంగా చంద్రబాబు గారెని కూడా అరెస్టు చేశారు

దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నియంతృత్వానికి అరాచకానికి చోటు లేదని 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు నిరూపించారు. ప్రపంచంలో ఎక్కడా ఏ పార్టీకి ఇవ్వనంతటి మెజార్టీ ఏపీలో కూటమికి ప్రజలు ఇచ్చి గెలిపించారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ భూముల్ని, భవనాలను, కలెక్టరేట్లను, రైతు బజార్లను, భవిష్యత్ మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూముల్ని కూడా కొట్టేయాలని జగన్ రెడ్డి ప్రయత్నించాడు. కూటమి అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం. కూటమి పాలన ప్రారంభం కాగానే.. అన్న క్యాంటీన్లు తెచ్చాం. మెగా డీఎస్సీపై సంతకం పెట్టాం. పెన్షన్లు పెంచుతూ చర్యలు తీసుకున్నాం. రూ.200 పెన్షన్ రూ.2000 చేసినా ఇప్పుడు రూ.4000 ఇచ్చినా అది కూటమి ప్రభుత్వ ఘనతే. అధికారంలోకి రాగానే రూ.3000 పెన్షన్ ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. తర్వాత వాయిదాల పేరుతో ప్రజల్ని దగా చేశాడు. 65 లక్షల మందికి పెన్షన్ల కోసం ఏటా రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వ ఘనతే. దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం ద్వారా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తూ 67 లక్షల మందికి అమలు చేశాం. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలనే లక్ష్యంతో విద్య వ్యవస్థను ప్రక్షాళన చేసి చూపించాం. సన్నబియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, యూనిఫాం, బుక్స్ అందింస్తున్నాం. త్వరలోనే ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతున్నాం. ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందించబోతున్నాం. మత్స్యకారుల జీవనోపాధికి మరణ శాసనంలా జగన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో నెం.217 రద్దు చేశాం. రోడ్లు, తాగునీరు, సాగునీరు లాంటి మౌలిక వసతులపై గతంలో అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని అడగాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. కానీ, నేడు ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజల్లోకి వస్తున్నాం.ప్రతి సమస్యను తెలుసుకుంటాం.. పరిష్కరించే వరకు అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తాం. ప్రభుత్వ పథకాలు అందలేదని వచ్చిన వారికి కూడా పరిష్కారం చూపిస్తున్నాం. వేట కోసం వెళ్లే అవసరాల కోసం రోడ్డు నిర్మించాలన్న ప్రజల వినతిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించి చూపిస్తాను. కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు సంస్థలతో మాట్లాడి నాగాయలంకలో ఏర్పాటు చేయిస్తాను. నాగాయలంక మండలంలో 24 రోడ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసి అన్ని గ్రామాలను సుందరంగా మారుస్తాను. కృష్ణా జిల్లా అభివృద్ధి విషయంలో శక్తి వంచన లేకుండా పని చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *