Breaking News

అభివృద్ధిలో కృష్ణా జిల్లాను మోడల్ జిల్లాగా మలుస్తాం

– ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు
– తమ కుంభకోణాల నుండి దృష్టి మరల్చేందుకు కులమత రాజకీయాలు
– కృష్ణా జిల్లా ప్రతిష్టను గత పాలకులు నాశనం చేశారు
– కూటమి ఎమ్మెల్యేలంతా చర్చించుకుని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నాం
– పి4, విజన్ 2047 విజయాలకు కేంద్రంగా కృష్ణా జిల్లాను మారుస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర

అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరిక నిర్మూలనతో పాటుగా అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.గత ఐదు సంవత్సరాలు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు కల్పించారు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పొరపాటున సోషల్ మీడియాలో గానీ, పత్రికా సమావేశాల్లో గానీ ప్రజా సమస్యలు లేవనెత్తిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులు, దాడులతో భయబ్రాంతులకు గురి చేశారు.

కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలకు జవాబుదారీగా నిలుస్తోంది. సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే ‘సుపరిపాలనలో తొలి ఏడాది’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధితో పాలన మొత్తాన్ని గాడిన పెట్టాం. ఆర్ధిక విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. గుంతలు లేని రోడ్లు సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్రంలో సుమారు 40 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టాం.

పెన్షన్, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాలు ఇప్పటికే అమలు చేశాం. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఆర్ధిక అభివృద్ధితో పాటుగా.. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా నడుస్తున్నాం. జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమల్ని తిరగి రాష్ట్రానికి రప్పించాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని, జీవో నెం. 217ను రద్దు చేశాం.

జగన్ రెడ్డి పాలనంతా దోపిడీలతో నిండిపోయింది. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాం జగన్ రెడ్డి అండతో జరిగింది. దాన్నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు డ్రామాలాడుతున్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కుట్ర రాజకీయాలకు తెరలేపారు.

పల్నాడులో పరామర్శ పేరుతో సింగయ్య అనే దళితుడిని కారు కింద తొక్కి చంపి, పరామర్శ పేరుతో వారి కుటుంబాన్ని బెదిరించారు. అంతకు ముందు పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రప్పా రప్పా నరుకుతాం అనే వారిని ప్రోత్సహిస్తున్నారు. జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తులకు ప్రజాస్వామ్య దేశంలో ఉండే అర్హత లేదని హెచ్చరించారు.

కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, జోగి రమేశ్ అనే కొందరు అరాచక శక్తులు కృష్ణా జిల్లా ప్రతిష్టను మసకబారేలా చేశారు. దాడులు, బూతులు, దోపిడీలతో జిల్లాను అరాచక శక్తులకు అడ్డాగా మార్చారు. కానీ ప్రస్తుతం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా చర్చించుకుని ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్ గా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం. పి4 ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. విజన్ 2047 ప్రకారం జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలిసి పని చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల బంగారు కుటుంబాలను గుర్తించాం. పెట్టుబడి పట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రజలు ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్తే సాధించలేనిది ఏమీ లేదని కూటమి ప్రభుత్వం చూపించబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *