Breaking News

అర్హులంద‌రికీ త్వ‌ర‌లోనే ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేస్తాం

-ఎన్నిక‌ల హామీల‌న్నీ ఒక్కొక్కటిగా అమ‌లు చేస్తున్నాం
-రూ.23.92 ల‌క్ష‌ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
-గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తెలుగుదేశంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి

గ‌న్న‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికీ త్వ‌ర‌లోనే ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేస్తామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కూట‌మి ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోందని అన్నారు. సుప‌రిపాల‌నలో తొలిఅడుగు- ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమ‌వారం నాడు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎనికేపాడు గ్రామంలో స్థానిక గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుతో క‌లిసి మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే కార్యాల‌యంలో 33 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.23.92 ల‌క్ష‌ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం రూ.45 ల‌క్ష‌ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల‌తో నిర్మించిన సీసీ రోడ్ల‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన మంత్రి… ఏడాది కూట‌మి పాల‌న‌లో హామీలు అమ‌ల‌వుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కూట‌మి అమ‌లు చేస్తున్న‌ ప‌థ‌కాల‌న్నీ ప్ర‌జ‌లంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాలని అన్నారు. త‌ల్లికి వంద‌నంతో పాటు పింఛ‌న్లు ఎలా అందుతున్నాయ‌ని ల‌బ్ధిదారుల‌తో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. అదే విధంగా ఏడాదిలో కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్రాంతంలో ఎక్కువ మంది ఇళ్ల స్థ‌లాలు కావాల‌ని విజ్ఞ‌ప్తి చేశార‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన అన్ని హామీల‌ను అమ‌లు చేస్తుంద‌ని స్ప‌ష్టం చేసిన మంత్రి… ఇళ్ల స్థ‌లాల విష‌యాన్ని అధికారుల‌కు చెప్పామ‌ని.., ఎంత మందికి అవ‌స‌ర‌మో నివేదిక రూపొందించ‌మ‌ని ఆదేశాలు కూడా జారీ చేశామ‌న్నారు. అర్హులంద‌రికీ అతి త్వ‌ర‌లోనే ఇళ్ల స్థ‌లాల‌ను మంజూరు చేస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమ‌లు చేస్తామ‌న్నారు. రాష్ట్రం లోటు బ‌డ్జెట్ లో ఉన్నా సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అండ‌గా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. అదే విధంగా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట ప‌డుతున్న యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు లాంటి ఎమ్మెల్యే దొర‌క‌డం గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ని ప్ర‌శంసించారు. రైతుల సాగునీటి ఇబ్బందులు తొల‌గించేందుకు సొంత నిధుల‌తో మోటార్లు అందించిన యార్ల‌గ‌డ్డ‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి అభినందించారు. సీఎం చంద్ర‌బాబు నాయుడుతో చ‌ర్చించి… గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌ల గ్రామాల‌ను విజ‌య‌వాడ మున్సిపాలిటీలో క‌లిపేందుకు కృషి చేస్తాన‌ని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో స్థానిక కూట‌మి నేత‌ల‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *