Breaking News

విజయవంతంగా మెగా DSC–2025 పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 06.06.2025 నుండి 02.07.2025 వరకు 23 రోజుల పాటు వివిధ పోస్టుల నియామకానికి నిర్వహించబడిన మెగా DSC–2025 పరీక్షలు అన్ని ప్రాంతాల్లో శాంతియుతంగా, సజావుగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి.

మొత్తంగా మెగా DSC–2025లో అన్ని పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులలో 92.90% మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇది గత recruitments తో పోల్చితే చాలా మంచి హాజరు శాతంగా నమోదు అయింది.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సాంకేతిక భద్రత:
• మెగా డీఎస్సీ–2025 పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో (CBT) నిర్వహించబడ్డాయి.
• కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానం నాన్-ఇంటర్వెన్షన్ మోడ్ లో ఉండి, మానవ జోక్యం లేకుండా పూర్తిగా సాంకేతికంగా నియంత్రిత వ్యవస్థగా ఉంటుంది.
• ప్రతి అభ్యర్థి లాగిన్, జవాబుల ఎంపిక, సమర్పణ తదితర చర్యలపై ఆడిట్ ట్రయిల్, సర్వర్ లాగ్లు భద్రంగా నమోదవుతాయి.
• ముఖ్యంగా, పరీక్షల నిర్వహణ సమయంలో ఎటువంటి సాఫ్ట్వేర్ లోపాలు లేదా సాంకేతిక సమస్యలు నమోదు కాలేదు.
రెస్పాన్స్ షీట్స్ – అభ్యర్థులకు పారదర్శకత:
• ప్రతి అభ్యర్థికి సంబంధించి ప్రాథమిక కీలు మరియు వ్యక్తిగత స్పందన షీట్లు అధికారిక వెబ్సైట్ (https://apdsc.apcfss.in) లో అందుబాటులో ఉంచబడ్డాయి.
• నిబంధనల మేరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆధికారిక ఫార్మాట్లో సమర్పించే అవకాశం కల్పించబడింది.
నిరాధార ఆరోపణలపై విజ్ఞప్తి:
• ఇటీవల కొన్ని పత్రికల కథనాలలో మరియు సోషల్ మీడియా వేదికలపై పరీక్షలపై తప్పుడు, నిరాధార ఆరోపణలు వెలువడుతున్నాయి.
• సాఫ్ట్వేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలు ఏ అధికారిక స్థాయిలో ధ్రువీకరించబడలేదు.
• ఈ తరహా వార్తలు అభ్యర్థులలో అనవసర ఆందోళన కలిగించడమే కాకుండా, ఇతర అభ్యర్థులు కూడా తాము పొందిన తక్కువ మార్కులకు తప్పుడు కారణాలు చెప్పే అవకాశం ఉన్నది.

అభ్యర్థులకు సూచనలు:
• దయచేసి అధికారిక సమాచారం లేని ప్రచారాలు, సోషల్ మీడియా కథనాలను విశ్వసించవద్దు.
• మీకు వాస్తవమైన సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఉన్న అభ్యంతరాల నమోదుకు అవకాశాన్ని వినియోగించుకోగలరు.
• పాఠశాల విద్యాశాఖ పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్ర భద్రత మరియు న్యాయతను కట్టుబడి అమలు చేస్తోందని స్పష్టంగా తెలియజేస్తున్నాం.
హెల్ప్ డెస్క్:
అభ్యర్థుల సహాయం నిమిత్తం (8125046997, 7995649286, 7995789286, 9398810958) హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *