Breaking News

ఏక‌మై పోరాడితేనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం… : డాక్ట‌ర్ జె. పూర్ణ‌చంద్ర‌రావు


-మొగ‌ల్రాజ‌పురంలో పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలంద‌రూ ఏక‌మై పోరాడితే త‌ప్ప మ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని, అందుకు అంతా ఏక‌మ‌వ్వాల‌ని ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్ట‌ర్ జె. పూర్ణ‌చంద్ర‌రావు పిలుపునిచ్చారు. విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురంలోని విశాలాంధ్ర రోడ్డు నిమ్మ‌తోట జంక్ష‌న్ వ‌ద్ద కొత్త‌గా ఏర్పాటుచేసిన ఏఐబీఎస్పీ రాష్ట్ర కార్యాల‌యం ప్రారంభోత్స‌వంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. “పాలక వ‌ర్గాలంద‌రూ ముస్లింల‌ను ఇత‌రుల‌కు శ‌త్రువులుగా చిత్రీక‌రిస్తున్నారు. అస‌లు వాళ్లు ఎవ‌రికి శ‌త్రువులు? బీసీ హిందువులకు ఎస్సీ ఎస్టీ లకు శత్రువులా.? ఎవ‌రికీ కారు. 5 లక్ష‌ల మందికి పైగా ఉన్న దూదేకుల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌రికి కూడా ఎమ్మెల్యేగా అవ‌కాశం రాలేదు. వడ్డీలు కుమ్మర్లు చాకలి మంగలి ఇంకా వంద బీసీ కులాలను హాయ్ ఎమ్మెల్యేలు లేరు. ఎందుకీ వివ‌క్ష‌? ఇక ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు కూడా కొన్ని కుటుంబాల‌కే ప‌రిమితం చేసుకుంటున్నారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ వ్య‌క్తి ముఖ్య‌మంత్రి అవ్వ‌డానికి అర్హ‌త లేదా? వైసీపీ అంటే జ‌గ‌నే ముఖ్య‌మంత్రి కావాలి. టీడీపీ అంటే అయితే చంద్ర‌బాబు, లేక‌పోతే ఆయ‌న కుమారుడు లోకేష్ ముఖ్య‌మంత్రి అవ్వాలి. వాళ్లు త‌ప్ప ఇత‌రులు ఎవ‌రూ పనికిరారా? అస‌లు వాళ్ల‌లో వాళ్ల‌కు ప‌ద‌వులు పంచుకోవ‌డానికే స‌మయం అంతా స‌రిపోతోంది త‌ప్ప‌, ఇత‌రుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌ట్లేదు. 80 లక్షల ఎస్సీ క్రిస్టియ‌న్ల ఎస్సీ హోదా స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌రు, మైదాన‌ప్రాంత గిరిజ‌నులైన ఎరుకల యానాదుల ఎస్టీ నియోజక వర్గాల ఏర్పాటు స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వు, అలాగే ఏజెన్సీ ప్రాంతాలలో స్థానికేతరులకు ఉద్యోగాలిచ్చే ఉత్తర్వుల రద్దు సమస్యలు పట్టవు. ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని కోరితే కోర్టు ఉత్త‌ర్వులు అడ్డంగా ఉన్నాయంటారు. మ‌రి 50 శాతం రిజ‌ర్వేష‌న్లు మించ‌కూడ‌ద‌ని చెబుతున్నా, ఈడ‌బ్ల్యుఎస్ పేరుతో మీకు మాత్రం 10 శాతం రిజ‌ర్వేష‌న్లు ఎక్క‌డినుంచి వ‌చ్చాయి? అది మీకెలా సాధ్య‌మైంది? అస‌లు రాజ్యాంగం ప్ర‌కారం సామాజికంగా, ఆర్థికంగా వెన‌క‌బ‌డిన‌వారికే రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలి. మ‌రి క‌మ్మ‌, రెడ్డి త‌దిత‌ర కులాల వాళ్లు సామాజికంగా వెన‌క‌బ‌డ్డారా? అర్థికంగానా ? అని సూటిగా ప్ర‌శ్నించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏఐబీఎస్పీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త బి. ప‌రంజ్యోతి, మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌కే రాజారావు, నూతన కమిటీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్, ఏలూరు జిల్లా అధ్యక్షులు ములకాల సత్యనారాయణ, వివిధ జిల్లాల అధ్యక్షులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *