Breaking News

ఎఐబీఎస్పీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులుగా పొనుగుపాటి శ్రీనివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్‌ ఇండియా బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులుగా పొనుగుపాటి శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. సోమవారం ఎఐబీఎస్పీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో నూతన కమిటీ నియామకంలో ఆల్‌ ఇండియా బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ను ఎఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్‌ జె.పూర్ణచంద్రరావు పార్టీ కండువాను కప్పి గౌరవ పూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొనుగుపాటి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపి మీలాంటి యువ నాయకులు పార్టీకి ఎంతో అవసరం అని మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పార్టీ అండదండలు వుంటాయన్నారు. పొనుగుపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పార్టీ తనపై వుంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలందరి సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు తనవంతు కృషి చేస్తానన్నారు. గతంలో వివిధ విభాగాలలో ఉన్నత పదవులలో పనిచేసిన అనుభవంతో పార్టీ సిద్దాంతానికి కట్టుబడి పార్టీని బలోపేతం చేయడానికి అందరినీ కలుపుకుని కొనసాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా తనను గుర్తించి ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులుగా ఉన్నత పదవి ద్వారా బాధ్యతలను అప్పగించిన ఎఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్‌ జె.పూర్ణచంద్రరావు, ఏఐబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త బి.పరంజ్యోతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *