-యువత సద్వినియోగం చేసుకోవాలి..
-కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.16.07.2025 బుధవారం ఉదయం 09:00 గంటలకు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల నందు “మెగా జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్, తెలియజేసారు.
ఈ జాబ్ మేళాలో, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, NS ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, దెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎమ్ఆర్ఎఫ్ లిమిటెడ్, గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హెచ్డిబి ఫైనాన్సియల్ సర్వీసెస్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, జోయాలుక్కాస్ జ్యువెలరీ, జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా క్యాపిటల్, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ డిజిటల్ వంటి సుమారు 30 ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు గారు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీ Dr. పి.నరేష్ కుమార్ గారు తెలిపారు.
ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, బి.ఫార్మసి మరియు పీజి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, జులై 16న నిర్వహించబోయే మెగా జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు మెగా జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 96666 54641, 96767 08041, 99895 19495, 99664 89796 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News