Breaking News

జగ్గయ్యపేట ను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి… : దోనేపూడిశంకర్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన, చెందుతున్న జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోదాడ రోడ్డు లోని డిపో సెంటర్ లో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ( పిల్లలమర్రి భవన్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలానికి ఎంతో పేరుగాంచిన జగ్గయ్యపేట లో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నూరు వసంతాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి జగ్గయ్యపేట ప్రాంతం ఎంతో పేరుగాంచిందని ఆయన అన్నారు. పారిశ్రామికంగా కూడా జగ్గయ్యపేట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్మిక పక్షపాతిగా ఉన్న జగ్గయ్యపేట మొట్టమొదటి శాసనసభ్యులు కామ్రేడ్ పిల్లల మర్రి వెంకటేశ్వర్లు నాలుగు పర్యాయాలు శాసనసభ్యులుగా సేవలు అందించార ని తెలిపారు. ఆగస్టు ఒకటి రెండు తేదీలలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు, పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టును, లింగాల బ్రిడ్జిని,పాలేటి పై కే. అగ్రహారం వద్ద ఉన్న బ్రిడ్జిని నూతనంగా నిర్మించాలని, ఏ.కొండూరు, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితులకు కృష్ణాజిల్లాలు పంపిణీ చేయాలని బుడమేరు ప్రక్షాళన, జగ్గయ్యపేట లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఊరికి దగ్గరలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ను తరలించాలని తదితర సమస్యలపై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆగస్టు ఒకటి రెండు తేదీలలో జగ్గయ్యపేటలో నిర్వహించే ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలలో పలు ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించుకునేలా ఈ మహాసభ వేదిక కానున్నదని తెలిపారు. ఈ జిల్లా మహాసభలకు హార్దికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేసారు. అనంతరం జిల్లా మహాసభ లకు సంభందించిన గోడ పత్రికను ఆవిష్కరించ్చారు.ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కామ్రేడ్ బుట్టి రాయప్ప, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మెటికల శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శి భోగ్యం నాగులు, పట్టణ సహాయ కార్యదర్శి మహమ్మద్ అసదుల్లా, కార్యవర్గ సభ్యులు రాణి,ఏఐవైఎఫ్ నాయకులు కరిసే మధు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *