విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అద్యక్షులు నారాయణ మూర్తి మరియు వైసీపీ నేతలు కమిషనర్ నీలం సాహ్నీని కలిశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా బందోబస్తుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని..అదేవిధంగా ఆన్లైన్ నామినేషన్స్ ఉంటే బాగుంటుందని కమిషనర్ ని వైస్సార్సీపీ నేతలు కోరారు.
Prajavartha Online Telugu News