Breaking News

మోసగాళ్లు మిరాకిల్ క్రైమ్ పేరుతో మోసాలు… : మెజీషియన్ క్రాంతి కార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బురిడీ బాబాలు, కొంతమంది మోసగాళ్లు మిరాకిల్ క్రైమ్ పేరుతో ఏ విధంగా మోసాలకు పాల్పడతారనే విషయాన్ని సీనియర్ మెజీషియన్ క్రాంతి కార్ వివరించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యాజిక్ ద్వారా డబ్బులు సృష్టించటం సాధ్యం కాదన్నారు. కొంతమంది మోసగాళ్లు లక్ష రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు వర్షంగా కురిపిస్తామంటూ భారీష్ గురు పేరుతో మోసాలు చేస్తున్నారన్నారు. మరికొందరు రైస్ పుల్లింగ్ పేరుతో పురాతన నాణ్యాలు, వస్తువులు వంటి వాటిని చూపించి కోట్ల రూపాయల ధర పలుకుతుందంటూ అమాయకులను మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారన్నారు. గుప్త నిధుల పేరుతో మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇటువంటి మోసాలను ప్రజలు నమ్మవద్దని మోసాలు చేసేందుకు కొందరు కేటుగాళ్లు మ్యాజిక్ చేసే మెజీషియన్లను ఎంపిక చేసుకొని వారి చేత అనేక మోసాలు చేయించి అమాయక ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. తాము చేసేది మోసం అని తెలియక అనేకమంది మెజీషియన్లు కేటుగాళ్ల బారిన పడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అదే తరహాలో తన దగ్గర శిష్యరికం నేర్చుకున్న సుధాకర్ అనే వ్యక్తి కేటుగాళ్ల బారినపడి కొంతమంది ప్రజలను మోసం చేశారని క్రాంతికర్ వివరించారు. చేసిన తప్పును తెలుసుకొని నా శిష్యుడు సుధాకర్ క్రాంతి కార్ పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని, పోలీసులు న్యాయస్థానాల శిక్షల తర్వాత సుధాకర్ కు  మంచి ఉపాధి మార్గాన్ని తామంతా కల్పిం చేందుకు సిద్ధంగా ఉన్నామని సుధాకర్ చెప్పే విషయాలు గమనించి మిరాకిల్ క్రైమ్ కు పాల్పడుతున్న మూఠాలను పోలీసు శాఖ గుర్తించి ప్రజలను అమాయక ప్రజలను రక్షించాలని అన్నారు. పోలీసు శాఖలో సైబర్ క్రైమ్ తరహాలో మిరాకిల్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య మంత్రి, హోం మంత్రిలను ప్రస్తుత డీజీపీలు కలిసి మెజీషియన్ల అసోసియేషన్ పక్షాన వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లు క్రాంతికార్ తెలిపారు. డబ్బు ఆశ చూపించి ఏ విధంగా మ్యాజిక్ తో మోసాలు చేస్తారో విలేకరులకు మెజిషియన్ ద్వారా చేసి చూపించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *