Breaking News

పీ4తో చేయందించి.. చేయూత‌నిస్తాం..

– గివ్ బ్యాక్ టు సొసైటీ స్ఫూర్తితో ముందుకొస్తున్న మార్గ‌ద‌ర్శులు
– కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములైన గాయ‌త్రీ వొడా టెక్‌, కృష్ణా ఇంజ‌నీరింగ్ వ‌ర్క్స్‌, డెవీ న్యూ లైఫ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స‌మాజాన్ని పేద‌రికం నుంచి దూరం చేయాల‌నే గొప్ప ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వినూత్నంగా ప్రారంభించిన పీ4 విధానంలో తామూ భాగ‌మ‌వుతామ‌ని గాయ‌త్రీ వొడా టెక్‌, కృష్ణా ఇంజ‌నీరింగ్ వ‌ర్క్స్‌, డెవీ న్యూ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ల నిర్వాహ‌కులు ముందుకొచ్చారు. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌కు త‌మ ఆస‌క్తిని తెలియ‌జేశారు.
పీ4 విధానం గురించి తెలుసుకున్న గాయ‌త్రీ వొడా టెక్‌, కృష్ణా ఇంజ‌నీరింగ్ వ‌ర్క్స్‌, డెవీ న్యూ లైఫ్ నిర్వాహ‌కులు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌తో స‌మావేశ‌మయ్యారు. గాయ‌త్రీ వొడా టెక్ నిర్వాహ‌కులు జి.వ‌ర‌ప్ర‌సాద్‌.. తాను భ‌వానీపురం ప్రాంతం హెబ్‌బీ కాల‌నీలోని 113 బంగారు కుటుంబాల‌కు మార్గ‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని వివ‌రించారు. అదేవిధంగా కృష్ణా ఇంజ‌నీరింగ్ వ‌ర్క్స్ య‌జ‌మాని బి.రాజ‌శేఖ‌ర్ ఎనికేపాడులో 149 కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకొచ్చారు. డెవీ న్యూ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట‌ర్ అమిత్ జిందాల్ 37 కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకొని ఆ కుటుంబాల‌కు అన్ని విధాలా చేయూత‌నిస్తామ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్వ‌ర్ణాంధ్ర సాకారం దిశ‌గా ప్ర‌యాణం చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా 2029 నాటికి శూన్య పేద‌రికం ల‌క్ష్యంగా పీ4 విధానాన్ని తేవ‌డం జ‌రిగింద‌న్నారు. బంగారు కుటుంబాలకు కాస్తా చేయందిస్తే చాలు.. ఆ ఆస‌రాతో వారి కుటుంబాల్లో వెలుగులు నిండుతాయ‌నే ఉద్దేశంతో చాలామంది వ్య‌క్తులు, సంస్థ‌లు స్పందించి మార్గ‌ద‌ర్శులుగా చేరుతున్నార‌న్నారు. జిల్లాలో ఇప్ప‌టికే 4,669 మంది మార్గ‌ద‌ర్శులు 37,780 కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకున్న‌ట్లు వివ‌రించారు. పేద‌లు ఎప్ప‌టికీ పేద‌లుగానే ఉండిపోకుండా వారూ అన్ని విధాలా ఎదిగి మ‌న‌తో పాటు న‌డిస్తే ఆ ఆనందానికి వెల‌క‌ట్ట‌లేమని.. బంగారు కుటుంబాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా పిల్ల‌లకు నాణ్య‌మైన విద్య‌, నైపుణ్యాభివృద్ధి, స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు, వైద్య సేవ‌లు త‌దిత‌రాల్లో మార్గ‌ద‌ర్శులు మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా బంగారు కుటుంబాలు కూడా మార్గ‌ద‌ర్శులుగా ఎదిగేలా చేయొచ్చ‌న్నారు. పీ4లో మేము సైతం అంటూ స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చిన గాయ‌త్రీ వొడా టెక్‌, కృష్ణా ఇంజ‌నీరింగ్ వ‌ర్క్స్‌, డెవీ న్యూ లైఫ్ యాజ‌మాన్యాల‌కు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *