Breaking News

ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా

-ప్రతిఒక్కరి ఇంటిపై జెండా ఎగరాలి
-జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించిన బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బీజేపీ నేతలు , ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు , అధ్యాపకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వా తంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి చాటుకోవాలని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీ షేక్ బాజీ,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఊర్మిళా నగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న తిరంగా యాత్ర ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం రామరాజ్యనగర్ , కబేళా ఉర్దూ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన రహదారి గుండా సితార వరకు సాగింది. బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ , బీజేపీ మైనార్టీ మోర్చా సెక్రటరీ షేక్ భాష,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఊర్మిళా నగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, బీజేపీ నేతలు త్రివర్ణ పతాకాలు చేతబూని భారతమాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర సెక్రెటరీ షేక్ భాష మాట్లాడుతూ అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయవచ్చన్నారు. వలస పాలనలో స్వేచ్ఛ భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల ధైర్యాన్ని, కృషిని గుర్తు చేశారు. దేశ జనాభాలో 20 శాతం గా ఉన్న ముస్లిం, మైనారిటీలు ప్రధాని మోడీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని తెలిపారు. ఊర్మిళా నగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వా తంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని, స్వాతంత్ర స్ఫూర్తిని, జాతి సమైక్యతను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బీ వెంకన్న, స్టాప్ కృష్ణ కిషోర్, రఫీక్ ,బీజేపీ నేతలు వై విశ్వేశ్వరరావు , దేవిన హరిప్రసాద్, పచ్చిపులుసు శివప్రసాద్, రెడ్డిపల్లి రాజు, పైలా సురేష్, కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావు, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, దుర్బేసుల హుస్సేన్, దుర్బేసుల మీరావలి, నున్నా కృష్ణ,లింగాల అనిల్, పిట్టల గోవిందు, పెదపాటి చంద్రశేఖర్, జ్ఞాన బాలన్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *