Breaking News

స్వాతంత్య్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చేపట్టిన తుది ఏర్పాట్లను మంగళవారం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మి శ, నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల15వ తేది శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు నగరపాలక సంస్థ, సాధారణ పరిపాలన శాఖ, వైద్య ఆరోగ్య, విద్యుత్, పోలీస్, ఫైర్ శాఖలతో సమన్వం చేసుకుని ఇటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రణాళికబద్ధంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. సామాన్య ప్రజలకు విఐపిలు, వివిఐపిలకు ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు ఉండాలని, వాహనాలకు కేటాయించిన పార్కింగ్ ను మరొకసారి పరిశీలించి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలనలో ఆర్డీవో కే చైతన్య, అడిషనల్ సిపి కేజీవి సరిత, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు:రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేష్ కీలక సమీక్ష.. గోదావరి పుష్కరాలు, ఇన్-బౌండ్ టూరిజం వృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *