Breaking News

కృష్ణానది, బుడమేరు పరివాహిక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తం గా ఉండాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం మంగళవారం సాయంత్రం శాఖధిపతులు, సిబ్బందితో వరద అప్రమత్తత పై టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో వ‌చ్చే రెండుమూడు రోజుల పాటు ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్న రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రిక‌ల‌తో పాటు ఎగువ నుంచి ప్ర‌కాశం బ్యారేజీకి వ‌ర‌ద పోటెత్తి క్రమేణా 4-5 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు కూడా చేరుకునే అవ‌కాశం ఉన్నందున‌, ముందు జాగ్ర‌త్త‌గా న‌దీ ప‌రిస‌ర ప్రాంత గ్రామాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు. న‌దివైపు వెళ్ల‌కుండా హెచ్చరిక‌ల బోర్డులు కూడా ఏర్పాటు చేయాల‌ని, కృష్ణానది మరియు బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేయాలని, అధికారులు నూతన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావస కేంద్రాల్లోకి తరలించాలని, ఫ్లడ్ అలర్ట్ టీమ్లు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాలలో వరద నీరు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఫ్లడ్ అలర్ట్ ప్రకటించి వారినీ పునరావస కేంద్రానికి తరలించాలని, అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధి లోగల సమస్యలను తెలిపేందుకు కంట్రోల్ రూమ్‌ను 24/7 అందుబాటులో ఉంచాలని కమిషనర్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *