Breaking News

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గుంటూరు నగరంలో అధిక ప్రాధాన్యం కలిగి వుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నగర సమగ్రాభివ్రుద్దె ధ్యేయంగా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని, రానున్న కాలంలో రాష్ట్రంలో ఉత్తమ నగర పాలక సంస్థగా తీర్చిదిద్దుకుంటామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు తెలిపారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి శుక్రవారం 79 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, జిన్నా టవర్ దగ్గర, యన్.టి.ఆర్ మునిసిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరణ, హిమని సెంటర్ లో మహాత్మా గాంధి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, యన్.టి.ఆర్ స్టేడియంలో యన్.సి.సి విద్యార్ధుల నుండి గౌరవ వందనం స్వీకరించి, విధుల యందు ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బంది, కార్యదర్శులకు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గుంటూరు నగరంలో అధిక ప్రాధాన్యం కలిగి ఉన్నదని, ఉద్యమ కాలంలో అనేక సభలు, సమావేశాలు గుంటూరు నగరంలో జరగటం గర్వకారనమన్నారు. గుంటూరు నగరంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నందివెలుగు బ్రిడ్జి పనులను ప్రారంభించుకోగాలిగామన్నారు. పి.వి.కె నాయుడు మార్కెట్ మరియు మానస సరోవరం పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నామన్నారు. నగర కమిషనర్ నేతృత్వంలో పారిశుధ్య విభాగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా జాతీయ స్తాయిలో స్వచ్చ సూపర్ లీగ్ సిటీస్ అవార్డ్ అందుకోవడం, రాష్ట్రంలో ఐ.వి.ఆర్.యస్ సర్వే లో వరుసగా మూడు పర్యాయాలు ప్రధమ స్తానంలో నిలబడటం, రాష్ట్ర స్తాయిలో 3,800 సచివాలయాల్లో ఉత్తమ 20 సచివలయలను ఎంపిక చేయగా వాటిలో 9 గుంటూరు నగర పాలక సంస్థ సచివాలయాలే కావటం గర్వకారణమన్నారు. రానున్న కాలంలో గుంటూరు నగర అభివృద్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కార్మికులు సమిష్టి కృషి చేస్తామన్నారు.

సదరు కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, విభాగాదిపతులు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *