Breaking News

అభివృద్ధి పనుల పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువు మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం కమిషనర్ ఉద్యోగనగర్, విజయపురికాలనీ, విద్యా నగర్, నవభారత్ నగర్ లలో పర్యటించి అభివృద్ధి పనులను, పొన్నూరు రోడ్ లో రోడ్, డ్రైన్ ఆక్రమణల తొలగింపుని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా అక్కడే పర్యవేక్షణ చేయాలన్నారు. పార్క్ లలో పచ్చదనం పెంపుతో పాటు, వాకింగ్ ట్రాక్ ల్లో నీరు నిల్వకుండా ముందస్తు డ్రైనేజి ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పొన్నూరు రోడ్ లో డ్రైన్, రోడ్ ఆక్రమణల తొలగింపుని పరిశీలించి, ఇప్పటికే పలు దఫాలుగా ఆక్రమణదారులకు నేరుగాను, మీడియా ద్వారాను స్వచ్చందంగా ఆక్రమణలను తొలగించుకొని సహకరించాలని తెలిపామన్నారు. కాని కొందరు ఆక్రమణదారులు రోడ్లు, డ్రైన్లను యదేచ్చగా ఆక్రమణ చేసుకొని, ట్రాఫిక్, మురుగుపారుదలకు ఆటంకాలు కల్గిస్తున్నారన్నారు. ఆక్రమణల తొలగింపులో రాజీ లేదని, వాటిని నూరు శాతం తొలగిస్తామని స్పష్టం చేశారు. స్వచ్చందంగా తొలగించుకోకుంటే జరిగే నష్టానికి వారే భాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.
పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, డిఈఈ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *