Breaking News

దివ్యాంగులకు సంబందించిన పింఛన్ల పునఃపరిశీలన…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్  అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం తిరుపతి జిల్లా దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, రామచంద్ర మొదలు వారు మరియు జాయింట్ కలెక్టర్శుభం బన్సాల్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బాలకృష్ణ నాయక్, రూయా హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ రాధ, డి సి హెచ్ ఎస్ ఆనంద మూర్తి మరియు పథ క సంచాలకులు, డి.ఆర్.డి.ఎ., శోభన్ బాబు హాజరై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్యం నిర్వహించిన దివ్యాంగులకు సంబందించిన పింఛన్ల పునఃపరిశీలన సందర్భంగా కొంతమంది అర్హులైన దివ్యాంగులను అనర్హులుగా గుర్తించడం వల్ల అన్యాయం జరిగిందని దివ్యాంగుల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద కలెక్టర్ స్పందించి రాష్ట్ర ప్రభుత్యం రీ-అసెస్మెంట్ లో ఎవరైతే నోటీసు లు అందుకున్నారో వారందరికీ కూడా సంబందిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో తిరిగి అప్పీలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి అటువంటి దివ్యాంగులు అందరు కూడా ఆప్పీల్ చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. అప్పీలు చేసుకున్న వారందరికీ కూడా సంబందిత ఆసుపత్రిలలో సదరం వెరిఫికేషన్ క్యాంపు లు ఏర్పాటు చేసి అత్యంత జాగ్రత్తగా వీటిని పరిశీలించి అర్హులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆ విధంగా సంబందిత వైద్య అధికారులు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది.కలెక్టర్గారుమనరాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని , ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రం లో దివ్యాంగులకు రూ.6000/- నుండి రూ.15000/- వరకు పెన్షన్ మొత్తాన్ని ఇవ్వడం జరుగుచున్నదన్నారు.
తదుపరి దివ్యాంగుల ప్రతినిధులు మాట్లాడుతూ తమను అనర్హులుగా గుర్తించినందు వల్ల లేదా ఎక్కువ శాతం అంగవైకల్యం నుండి తక్కువ శాతం అంగవైకల్యం గా నమోదు చేసినందువలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అనేక సంక్షేమ ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది.80% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం లక్ష రూపాయలు కంటే ఎక్కువ విలువ కలిగిన మూడు చక్రాల వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అటువంటి అవకాశం కోల్పోతామణి,అదేవిధంగా రైల్వే శాఖ ద్వారా తమతో పాటు ప్రయాణించే తమ సహాయకులకు కూడా 75శాతం వరకు ఛార్జీల రాయితీ, ప్రభుత్వ ఉద్యోగాలలో వైకల్యం శాతంఆధారంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, కాబట్టి అటువంటి వైకల్య శాతం తగ్గితే ఉద్యోగాలలో ప్రాధాన్యత కోల్పోయే అవకాశం ఉందని,అలాగే ఎస్.సి.,ఎస్.టి., బీసీ., మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పొందే సబ్సిడీ కోల్పోతామనిఅలా జరగకుండాచూడాలని జిల్లా కలెక్టర్ గారినికోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారుఅర్హులైనదివ్యాంగ్యులందరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని,దివ్యాంగులుఎవ్వరూ అదైర్య పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇవ్వడం జరిగింది. దివ్యంగులప్రతినిధులుసంతోషం వ్యక్తం చేసి కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *