విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో (డబుల్స్ )ఉమెన్ కేటగిరీలో ప్రథమ బహుమతి సాధించిన డోకుపర్తి తేజస్విని(15) ను ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అభినందించారు. భవానిపురం కు చెందిన డోకుపర్తి తేజస్విని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ డబుల్స్ ఉమెన్ కేటగిరిలో తేజస్విని ప్రథమ బహుమతి సాధించింది. మెరుగైన ప్రతిభను కనబరిచిన డోకుపర్తి తేజస్విని కు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అభినందించి ట్రోఫీను అందజేశారు. శాప్ కోచ్ కే భాస్కర్ శిక్షణ లో ప్రతిభ కనబరిచినచిన్నారి తేజస్విని అడ్డూరి శ్రీరామ్, ప్రత్తిపాటి శ్రీధర్ అభినందించారు. భవిష్యత్తులో భారతదేశం తరపున బ్యాడ్మింటన్ విభాగంలో మరెన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు కూటమి నేతలు కోలపల్లి గణేష్, పచ్చిపులుసు శివప్రసాద్, వేరుకొండ ఉమాకాంత్, మంగళపురి మహేష్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు శిరీషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News