Breaking News

మధు మస్తాన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 54 వ జన్మదిన వేడుకలు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, అఖిలభారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఎస్ కృష్ణ ప్రసాద్, ఎల్ శ్యామ్ ప్రసాద్,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు,జన సైనికులతో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. కూటమి నేతలు హాజరై సంబరాలు జరిపారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని పలువురు నేతల ఆకాంక్షించారు..

కార్యక్రమంలో బీజేపీ వెస్ట్ ఇన్చార్జ్ కోలపల్లి గణేష్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చి పులుసు శివప్రసాద్, జనసేన వీరమహిళలు మల్లేపు విజయలక్ష్మి, రెడ్డిపల్లి అనిత, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు శిరీషా కిరణ్ , కూటమి నేతలు రెడ్డిపల్లి గంగాధర్, పోతిన భేసు కంటేశ్వరుడు, పల్లంటి ఆది, వేరుకొండ ఉమాకాంత్ ,కొమ్మూరి అరవింద్, యెనిగళ్ళ అమర్ బాబు , పిళ్ళ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *