Breaking News

సబ్ కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తాను చేపట్టిన ఉపాధ్యాయ వృతికే కాకుండా ఆయన అధిరోహించిన పదవులకు వన్నె తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు వున్నా వారందరిని తయారుచేసే ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పిన స్వర్గీయ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసరెడ్డి,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *