-గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వీరికోసం అనేక సామాజిక, ఆర్థిక పథకాలు అమలు చేస్తోంది. విద్య, ఆర్థిక సహకారం, భూమి ఆధారిత పథకాల అమలుకు శ్రద్ధ తీసుకుంటోంది. గిరిజనుల సమస్యల పరిష్కార విషయంలో జగనన్న ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వారిలో గూడుకట్టిన అసంతృప్తిని పారద్రోలేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాలకులపై వారికి విశ్వాసం, నమ్మకం ఏర్పడుతోంది .
కౌలు రైతులు ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకోవాలని కౌలు రైతులు, వాస్తవ సాగుదార్లకు పంట సాగుహక్కుల కార్డు (సీసీఆర్సీ)ల ద్వారా పలువురు లబ్ది పొందుతున్నారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి ఇచ్చే ఈ కార్డులతో కౌలు రైతులు ప్రభుత్వం అందించే రాయితీ పథకాలు, వ్యవస్థాగత పరపతి పొందుతున్నారు. ఏపీ పంట సాగుదారుల చట్టం–2019 ప్రకారం ఈ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డుపై పంట రుణం తీసుకుంటే పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత సాగుదారుదే. ఒకవేళ రుణం కట్టకుంటే ఆ బాధ్యత భూ యజమానిపై ఉండదు. రుణం ఇచ్చిన బ్యాంకు భూ యజమానికి ఇబ్బంది కలిగించకుండా ప్రభుత్వం తగిన ఏర్పాటు చేసింది.
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలంలోని గడ్డమోని గ్రామ పంచాయితీకి చెందిన అజ్మీరా హేమనాయక్ తన పేరిట సెంటు భూమి సైతం లేని నిరుపేద కౌలు రైతు. తాను సాగు చేస్తున్న రెండు ఎకరాల భూమిపై పంట సాగు హక్కుల కౌలు కార్డు తీసుకొన్నారు. ఆ కార్డుపై కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖకు 10 వేల రూపాయలు చెల్లించి 90 వేల రూపాయల ఖరీదు చేసే కలుపు తీసే పవర్ హీటర్ యంత్రాన్ని పొందానని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్ల నుంచి కలుపు తీసే కూలీల సంఖ్య బాగా తగ్గుముఖం పడుతోందని వ్యవసాయంలో రైతు పెట్టే పెట్టుబడుల్లో కలుపుతీత ఎంతో ప్రాధాన్య మైనదని అన్నారు. కలుపు తీసే వ్యవసాయ కూలీలకు తమ ప్రాంతంలో కొరత ఉన్న నేపథ్యంలో కలుపు తీసే పవర్ హీటర్ యంత్ర ఆవశ్యకత గుర్తించి దానిని పొందేందుకు కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమశాఖ ద్వారా ప్రయత్నించినట్లు హేమనాయక్ తెలిపారు.
పొలంలో కలుపు తీయడం తమకు తలకు మించిన భారంగా మారిందని పలువురు రైతులు వాపోతుంటారు. కూలీలు దొరకడం ఒక సమస్య అయితే, కూలీ రేట్లు ఏటా భారీగా పెరిగిపోవడంతో రైతులు నానాతంటాలు పడుతున్నారు. కలుపు వలన చీడ పీడలు పొలంలో బాగా పెరుగుతాయి, అంతేకాక ప్రధాన పంటకు అందవలసిన పోషకాలను ఇవి నేరుగా స్వీకరిస్తాయి, తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. ఉదాహరణకు “ఊదర” మొక్క పూర్తిగా వరి మొక్క లాగే వుంటుంది. వరి మొక్కల మధ్య చేరి అక్కడున్న బలాన్ని అతి తొందరగా పీల్చు కుంటాయి. సకాలంలో వాటిని పీకేయక పోతె వరి పంట సరిగా పండదు. అంతా ఊదర పంటే విస్తారంగా వ్యాపిస్తుంది. వరి ఊదర చూడ డానికి ఒకే విధంగ వున్న ఊదర అతి వేగంగా ఏపుగా పొలంలో పెరిగుతాయి. రైతు ఆ తేడాను బట్టి గుర్తించి వాటిని పీకి అక్కడె ఆ బురదలోనె రైతులు పూడ్చేస్తారు.
ఇప్పుడున్న పరిస్థితులలో ఎకరం పొలంలో కలుపు తీయాలంటే 30 మంది కూలీలు పని చేయాలి. ఒక్కో కూలికి 200 రూపాయల కూలి చొప్పున 6 వేల రూపాయల ఖర్చు అవుతుందని, తాను కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పొందిన పవర్ హీటర్ యంత్రంను ఎకరం పొలంలో ఉపయోగించడానికి రెండు లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుందని, కేవలం ఒక కూలి సహాయం అవసరం మాత్రమే సరిపోతుందని దేనికి మొత్తం ఖర్చు 500 రూపాయలు సరిపోతుందని చెబుతూ, తనకు మొత్తం మీద కలుపు తీయించుకొని రైతు 2 వేల రూపాయలు ఇస్తే సరిపోతుందని, తనకు 1500 రూపాయలు , కలుపు తీయించుకొని రైతుకు ఎకరానికి 4 వేల రూపాయలు మిగులుతుందని హేమానాయక్ పేర్కొన్నారు. తమ ప్రాంతంలో రైతులు ఇప్పుడిప్పుడే ఈ ఆధునిక యంత్రం పని తీరుపట్ల ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.తన పవర్ హీటర్ యంత్రం వ్యవసాయక్షేత్రంలో కలుపు మొక్కలను ఎలా నిర్ములిస్తుందో ప్రత్యక్షంగా చూసి తమ పొలానికి ఆ యంత్రాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నారని వివరించారు. గిరిజన సంక్షేమ ద్వారా తనకు లభించిన పవర్ హీటర్ యంత్రం ప్రస్తుతం తన కుటుంబ పోషణ ఎంతో మెరుగ్గా మారిందని తనను ఆదుకున్న గిరిజన సంక్షేమ శాఖ, జగనన్న ప్రభుత్వానికి హేమనాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News