విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పైకొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయింది. కూటమి ప్రభుత్వం దుర్గమ్మ గుడికి ట్రస్ట్ బోర్డును నియమించింది. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఏపీ ప్రభుత్వం బొర్రా రాధ కృష్ణ( గాంధీ) ను నియమించింది. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బొర్రా రాధ కృష్ణ , మరియు నూతన పాలకమండలి సభ్యుల తో ఈ ఓ శీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు,విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) పాల్గొని నూతన పాలకమండలి చైర్మన్ బొర్రా రాధ కృష్ణ ను పాలకమండలి సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పాలకమండలి ఆధ్వర్యంలో దుర్గమ్మ గుడి మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News